YSRCP: పుత్తూరులో రోజా అరెస్ట్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

  • పుత్తూరులో రోజా, నారాయణస్వామి అరెస్ట్
  • సీఎంపై రోజా అగ్గిమీద గుగ్గిలం
  • హోదా రావడం బాబుకు ఇష్టం లేదన్న మహిళా నేత

ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ వైసీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తోంది. రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్న పలువురు పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో బంద్‌లో పాల్గొన్న వైసీపీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజాతోపాటు ఎమ్మెల్యే నారాయణస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తనను అరెస్ట్ చేయడంపై రోజా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోదా కోసం బంద్ పాటిస్తున్న తమను అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని రోజా దుమ్మెత్తి పోశారు.

YSRCP
Andhra Pradesh
MLA Roja
Arrest
  • Loading...

More Telugu News