YSRCP: విజయవాడలో కొనసాగుతున్న బంద్.. బయటకు రాని బస్సులు!
- ఏపీలో పలు చోట్ల కొనసాగుతున్న బంద్
- పశ్చిమలో బయటకు రాని పలు డిపోల బస్సులు
- ఏలూరు జూట్ మిల్లుకు సెలవు
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైసీపీ చేపట్టిన బంద్ విజయవాడలో కొనసాగుతోంది. నగరంలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్ ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. బంద్ కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 8 డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. బస్ స్టేషన్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు, యలమంచిలి రవి పాల్గొన్నారు. కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలో కూడా వైసీపీ నాయకులు ఆందోళన చేపడుతున్నారు. బంద్ కారణంగా ఏలూరులోని జూట్‌మిల్లు కూడా మూసివేశారు.
నెల్లూరులో ఈ ఉదయం ఆరు గంటల నుంచే బంద్ ప్రారంభమైంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నాకు దిగారు. ఆత్మకూరు మీదుగా వెళ్లే బస్సులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.