Chandrababu: మహిళలను మభ్యపెట్టి, దీక్షలకు తరలిస్తారు: చంద్రబాబుపై వైసీపీ విసుర్లు

  • ధర్మ దీక్షల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
  • నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కూడా వాడుకుంటున్నారు
  • చిత్తశుద్ధి ఉంటే వైసీపీ బంద్ కు టీడీపీ సహకరించాలి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధర్మ దీక్షల కోసం 40 నుంచి 50 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కూడా తమ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

డ్వాక్రా, అంగన్ వాడీ, ఉపాధి హామీ మహిళలను మభ్యపెట్టి దీక్షలకు తరలించి చంద్రబాబు డ్రామాలు ఆడుతారని అన్నారు. టీడీపీ, బీజేపీలు మిత్రులేనన్న విషయం పార్లమెంటు సాక్షిగా స్పష్టమయిందని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే రేపు వైసీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సహకరించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.

Chandrababu
gadikota
srikanth reddy
ysrcp
bandh
  • Loading...

More Telugu News