ajith: అజిత్ ఎలా వుంటాడనేది నేను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను: 'ఛత్రపతి' శేఖర్

- ఆయనకి గొడుగుపట్టే అసిస్టెంట్ వుండడు
- ఎంత ఎండలోనైనా అలాగే నుంచుంటారు
- బిర్యాని చేసి మాకు స్వయంగా వడ్డించారు
'ఛత్రపతి' శేఖర్ మొదటినుంచి కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్ మూవీలో చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అజిత్ గురించిన విషయాలను ప్రస్తావించాడు. "ఇటీవల ఎండల్లో షూటింగు మొదలైంది. మొదటి రోజున దర్శకుడు నన్ను ఆయనకి పరిచయం చేశాడు. 'బాగున్నారా' అంటూ ఆయన చాలా ఆత్మీయంగా పలకరించారు.
