jagan: చిరంజీవి హోల్ సేల్ గా అమ్ముకుంటే.. పవన్ రీటెయిల్ గా అమ్ముకున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

  • హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ ప్రతిజ్ఞ ఏమైంది?
  • పవన్, జగన్ లు తమ పార్టీలను మోదీ వద్ద తాకట్టు పెట్టారు
  • పురందేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని పవన్ చెప్పారని... ఆ ప్రతిజ్ఞ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు చిరంజీవి హోల్ సేల్ గా అమ్మేశారని... జనసేన పార్టీని బీజేపీకి పవన్ రీటెయిల్ గా అమ్ముకున్నారని విమర్శించారు. ప్యాకేజీ కోసం పవన్, కేసుల మాఫీ కోసం జగన్ తమ పార్టీలను మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి, కేంద్ర మంత్రి పదవిని అనుభవించినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అని పురందేశ్వరిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. 

jagan
Pawan Kalyan
Chiranjeevi
purandheswari
rajendra prasad
  • Loading...

More Telugu News