BSNL: నెలకు 3000 జీబీ డేటా: బీఎస్ఎన్ఎల్

  • రూ. 16,999 విలువైన ప్లాన్ సవరణ
  • 100 ఎంబీపీఎస్ వేగంతో 3 టీబీ డేటా
  • ఇతర ప్యాక్ లపై మరింత డేటా ఇస్తామన్న బీఎస్ఎన్ఎల్

రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించింది. ఎఫ్ టీటీహెచ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను సవరిస్తూ, సెకనుకు 100 మెగాబైట్ల వేగంపై నెలకు 3000 మెగాబైట్ల డేటాను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. రూ. 16,999 విలువైన ప్లాన్ పై ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో రూ. 3,999 ప్లాన్ లో 50 ఎంబీపీఎస్ వేగంతో 500 జీబీ (ఇప్పటివరకూ 300 జీబీ), రూ. 5,999 ప్లాన్ పై 1000 జీబీ (ఇప్పటివరకూ 400 జీబీ), రూ. 9,999 ప్లాన్ పై 2000 టీబీ (ఇప్పటివరకూ 600 జీబీ) డేటాను అందిస్తున్నట్టు పేర్కొంది. మిగతా అన్ని రకాల రీచార్జ్ ప్యాక్ లనూ సవరించామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

BSNL
Deta
Broadband plan
Jio
  • Loading...

More Telugu News