benguluru: బెంగళూరులో సంచలనం.. బ్యాడ్మింటన్ కోర్టు లాకర్లలో రూ. 500 కోట్లు

  • మూడు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం
  • రియలెస్టేట్ వ్యాపారి అవినాష్ కు చెందిన సంపద
  • గుజరాత్ నుంచి బెంగళూరుకు వలస వచ్చిన అవినాష్

బెంగళూరులోని ఓ బ్యాండ్మింటన్ కోర్టు లాకర్లలో రూ. 500 కోట్ల నల్లధనం వెలుగు చూసిన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని సెయింట్ మార్క్స్ రోడ్డులో ఉన్న ఎలైట్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్టులో ఉన్న మూడు లాకర్లలో ఈ బ్లాక్ మనీ బయటపడింది. రియలెస్టేట్ వ్యాపారి అవినాష్ అమరలాల్ కుక్రేజాకు చెందిన ఈ నల్లధనాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనికి తోడు రూ. 7.8 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, రూ. 5.7 కోట్ల విలువైన విదేశీ నగదును కూడా గుర్తించారు. రాజస్థాన్ కు చెందిన అవినాష్ బెంగళూరుకు వలస వచ్చి, రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్టు కార్యాలయంలో ఉన్న 69, 71, 78 నెంబర్ లాకర్లను తెరిచి చూడగా దిమ్మతిరిగేలా భారీ సంపద వెలుగుచూసింది. నగదు, ఆస్తులను సీజ్ చేశామని... దర్యాప్తు చేపట్టామని ఐటీ అధికారులు తెలిపారు.

benguluru
500 crores
seize
  • Loading...

More Telugu News