nagachaitanya: అభిమానులకు శుభవార్త .. సమంత - చైతూ జంటగా కొత్త సినిమా లాంచ్

- శివ నిర్వాణ దర్శకుడిగా కొత్త చిత్రం
- దర్శకుడికి స్క్రిప్ట్ అందజేసిన నాగ్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
పెళ్లి తరువాత సమంత .. చైతూలను తెరపై జంటగా చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. అయితే కథ కుదరకపోవడం వలన ఈ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల దర్శకుడు శివ నిర్వాణ వినిపించిన కథ నచ్చడంతో, సమంత .. చైతూ ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అనే ఆత్రుత అందరిలోనూ మొదలైంది.
