Twitter: ట్విట్టర్... నా భర్త పెట్టిన వీడియో ప్లే కావడం లేదు: ఉపాసన ఫిర్యాదు

  • నిన్న ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పుట్టిన రోజు
  • విషెస్ చెబుతూ వీడియో పోస్ట్ చేసిన రామ్ చరణ్
  • ప్లే కాకపోవడంతో ఫిర్యాదు చేసిన ఉపాసన

తన భర్త రామ్ చరణ్ పెట్టిన ఓ వీడియో ప్లే కావడం లేదని ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారు ఉపాసన కామినేని. నిన్న ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ పుట్టిన రోజు కావడంతో, 'హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ అభయ్ రామ్. హ్యావ్ ఏ సూపర్ బర్త్ డే' అని క్యాప్షన్ పెడుతూ, ఓ వీడియోను రామ్ చరణ్ పోస్టు చేశాడు.

అయితే ట్విట్టర్ లో అది ప్లే కావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన ఉపాసన, 'ట్విట్టర్ సపోర్ట్'ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. వీడియో లోడ్ కావడం లేదని చెబుతూ, ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న అదే వీడియో లింక్ ను పోస్ట్ చేశారు. అంతకుముందు వేల మంది రామ్ చరణ్ వీడియోను చూసేందుకు ప్రయత్నించి విఫలమై, వీడియో రావడం లేదని కామెంట్లు పెట్టారు.

Twitter
Video
Upasana
Ramcharan
NTR
Abhay Ram
Birth Day
  • Error fetching data: Network response was not ok

More Telugu News