Jackie Shroff: దటీజ్ జాకీ ష్రాఫ్.. లక్నో రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన నటుడు!

  • ట్రాఫిక్ క్లియర్ చేసిన బాలీవుడ్ నటుడు
  • ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యాకే వెళ్లిన వైనం
  • ప్రశంసిస్తున్న నెటిజన్లు

ట్రాఫిక్ జామ్‌తో జనాలు ఇబ్బంది పడుతుంటే కారులో ఉన్న బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిందీ ఘటన. 61 ఏళ్ల నటుడు తన కారు దిగి.. వాహనాలను మళ్లిస్తూ బిజీగా కనిపించాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను మళ్లించి, మరోవైపు ఇటువైపు వెళ్తున్న వాహనాలకు మార్గనిర్దేశం చేశాడు. మొత్తం ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన తర్వాతే ఆయన అక్కడి నుంచి కదిలాడు.

జాకీ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుండగా వీడియో తీసిన అభిమానులు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. లక్నోలో ఓ షూటింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోను చూసిన వారు జాకీని ప్రశంసిస్తున్నారు.

Jackie Shroff
Bollywood
Uttar Pradesh
Lucknow
  • Loading...

More Telugu News