Telangana: నిరుద్యోగ యువతకు కేసీఆర్ తీపి కబురు.. పంచాయతీ కార్యదర్శుల నియామకాలు!

  • 9,200 మంది నియామకం
  • రెండు నెల్లలోనే నియామకాలు పూర్తి
  • ప్రొబేషనరీ కాలం మూడేళ్లు

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే 9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. వారం రోజుల్లోనే ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని, రెండు నెలల్లో భర్తీ పూర్తవుతుందని తెలిపారు. పల్లెలను అభివృద్ధి బాట పట్టించడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

కొత్త కార్యదర్శులను మూడేళ్ల ప్రొబేషనరీ పిరియడ్ తర్వాత వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం పేర్కొన్నారు. విధులు సరిగా నిర్వర్తించని కార్యదర్శులను క్రమబద్ధీకరించకుండా ఉండే విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రొబేషన్ పిరియడ్‌లో కార్యదర్శులకు నెలకు రూ.15 వేలు వేతనం ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యదర్శుల నియామకాల విషయంలో రిజర్వేషన్ పాటించాలని సూచించారు.

  • Loading...

More Telugu News