Andhra Pradesh: పేరూరు డ్యాం నిర్మాణ పనుల్లో కూలీగా మంత్రి పరిటాల సునీత!

  • పైలాన్‌ను ఆవిష్కరించనున్న చంద్రబాబు
  • పర్యవేక్షణకు వెళ్లి పనులు చేసిన సునీత
  • కూలీలతో కలిసి తట్ట మోసిన మంత్రి

అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరు డ్యాం నిర్మాణ పనుల్లో మంత్రి పరిటాల సునీత పనిచేశారు. పేరూరు డ్యాంను నిర్మించాలనేది మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కల. అయితే, అది తీరకుండానే ఆయన హత్యకు గురయ్యారు. దీంతో డ్యాం నిర్మాణ పనులను ఆయన సతీమణి సునీత భుజాలకెత్తుకున్నారు.

డ్యాం కాలువ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా అక్కడ పైలాన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన మంత్రి సునీత అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. కూలీలా తలకు బట్ట చుట్టుకుని తట్టతో ఇసుక, సిమెంట్ అందించారు. మంత్రి స్వయంగా పనులు చేయడంతో కూలీలు మరింత ఉత్సాహంగా పనిచేశారు.

Andhra Pradesh
Paritala sunitha
peruru dam
Chandrababu
  • Loading...

More Telugu News