modi: దేశంలో మోదీని ఎదిరించిన నేత చంద్రబాబే!: మంత్రి ప్రత్తిపాటి

  • ప్రధాని మోదీ అహంభావంతో వ్యవహరిస్తున్నారు
  • బీజేపీ అసలు స్వరూపం బయటపడింది
  • అవిశ్వాసం పెట్టిన సమయంలో జగన్ కోర్టులో ఉన్నారు

దేశంలో మోదీని ఎదిరించిన నేత చంద్రబాబేనని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ అసలు స్వరూపం బయటపడిందని, తెలుగోడి ఆగ్రహానికి గురైన ఏ నాయకుడికైనా పతనం తప్పదని మండిపడ్డారు, ఏపీకి చేయూత నివ్వాల్సిన ప్రధాని మోదీ అహంభావంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసం పెట్టిన సమయంలో జగన్ కోర్టులో ఉన్నారని, పవన్ కల్యాణ్ ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేశారని విమర్శించారు.

modi
prathipati
  • Loading...

More Telugu News