godavari: పోలరవం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి!

  • అంతకంతకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • పోలవరం నుంచి 17 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • సహాయకచర్యలను చేపట్టిన అధికారులు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం వద్ద వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. కొత్తూరు కాజ్ వే పైకి కూడా వరదనీరు చేరుకుంది. దీంతో  పోలవరం నుంచి 17 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం కడెమ్మ వంతెనకు భారీగా నీరు చేరుకుంటోంది.

 గోదావరికి అడ్డుగా వేసిన నెక్లెస్ బండ్ మట్టి జారిపోవడంతో, పాత పోలవరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. గిరిజన గ్రామాలకు నిత్యావసర వస్తువుల కొరతను రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్డీవో మోహన్ కుమార్ తెలిపారు.

godavari
floods
polavaram
  • Loading...

More Telugu News