Tamilnadu: స్కూల్ లో ఫైటింగ్... తోటి విద్యార్థిని చంపి, భయంతో ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి!

  • తమిళనాడులోని కయత్తూరులో ఘటన
  • నరసింహన్ ను గాల్లోకి లేపి నేలకేసి కొట్టిన వడయార్
  • ఆపై భయంతో బావిలో దూకి ఆత్మహత్య!

తమిళనాడులో ఓ క్లాస్ రూములో జరిగిన వివాదం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. కోయంబత్తూరు జిల్లా కయత్తూరులోని ఫాతిమా మెట్రిక్యులేషన్‌ స్కూల్‌ లో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూములో గొడవపడి ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.

ఈ క్రమంలో, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ రెజ్లింగ్‌ తరహాలో వడయార్ అనే విద్యార్థి నరసింహన్ అనే మరో విద్యార్థిని గాల్లోకి లేపి కిందకేసి కొట్టాడు. తల, నడుముకు బలమైన గాయం కావడంతో విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఆసాంతం క్లాస్ రూములోని సీసీ కెమెరాలో రికార్డు అయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు విచారిస్తుండగానే, సహ విద్యార్థిని చంపినందుకు తనను ఏం చేస్తారోనన్న భయాందోళనలతో వడయార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వడయార్ నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ఎవరైనా బావిలో పడేశారా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tamilnadu
Kayattore
School
WWF Fighting
Sucide
  • Loading...

More Telugu News