Rahul Gandhi: అవిశ్వాస తీర్మానం ‘ఫిఫా’.. మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా: శివసేన

  • రాహుల్ ఓడినా ప్రజల మనసులు గెలిచారు
  • అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఆలింగనం
  • రాహుల్‌ను అభినందించాలి

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని శివసేన సరికొత్తగా అభివర్ణించింది. ఇటీవల ముగిసిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌తో దీనిని పోల్చింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రాన్స్‌లా ఫైనల్లో విజయం సాధిస్తే.. రాహుల్ గాంధీ ఓడినా క్రొయేషియాలా దేశం మనసును గెలుచుకున్నారని పేర్కొంది.

‘‘ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్ విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, క్రొయేషియా ఆడిన తీరు మాత్రం అద్భుతం. రాహుల్ కూడా అలాగే చేశారు. ఎందరో హృదయాలను గెలుచుకున్నారు’’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఆలింగనంపై స్పందిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఆయనలా చేసినట్టు చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ కొత్త అవతారంలో కనిపించారని, అందుకు ఆయనను అభినందించాలని అన్నారు.

Rahul Gandhi
Narendra Modi
FIFA
France
Croatia
  • Loading...

More Telugu News