Niharika: పద్ధతిగా పెళ్లి చేసుకుంటా: నాగబాబు కుమార్తె, నటి నిహారిక

  • పెళ్లీడు అమ్మాయిల్లో కోరికలు సహజం
  • కొందరి వివాహాల్లో చిన్న చిన్న తప్పులు
  • తన జీవితంలో అలా జరగకుండా చూసుకుంటానన్న నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు కుమార్తె నిహారిక, తన తాజా చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్' ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లీడుకు వచ్చిన ప్రతి అమ్మాయికీ తన పెళ్లి ఎలా జరగాలన్న విషయమై కొన్ని కోరికలు ఉండటం సహజమని, తనకూ అలాగే అనిపిస్తుందని చెప్పింది. కానీ కొందరి వివాహాల్లో జరిగిన చిన్న చిన్న తప్పులు చూసిన తరువాత, అలా కాకుండా పద్ధతిగా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చింది.

ఆమధ్య కాలంలో పెదనాన్న చిరంజీవి కుమార్తె సుస్మిత పెళ్లిని బాగా ఎంజాయ్ చేశానని చెప్పిన నిహారిక, తనకు ఊహ తెలిసిన తరువాత ఇంట్లో జరిగిన తొలి పెళ్లి అదేనని, సంగీత్ నుంచి ప్రతి కార్యక్రమమూ ఇంట్లోనే జరుగగా, చాలా అల్లరి చేశానని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే, పాటకు ముందు వచ్చి, తరువాత వెళ్లిపోయే కథలంటే తనకు ఇష్టముండదని, అటువంటి పాత్రలతో వచ్చిన 8 కథలకు ఈమధ్యకాలంలో నో చెప్పానని అంది. అలాగని అన్ని కథలూ బాగాలేవని కాదని, తనకు సరిపడలేదని అనిపించిందని చెప్పింది.

Niharika
Nagababu
Marriage
Mega Family
  • Loading...

More Telugu News