Telugudesam: రాజీనామా చేయబోతున్నానన్న మాట నిజమే: జేసీ దివాకర్ రెడ్డి

  • ఎప్పుడు చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు
  • రాజకీయ వాతావరణం బాగాలేదు కాబట్టే రాజీనామా
  • అందరికీ చెప్పే చేస్తానన్న జేసీ

ఎంపీ పదవికి తాను రాజీనామా చేయబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని, ఆ వ్యాఖ్యలు తానే చేశానని టీడీపీ నేత, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో రాజకీయ వాతావరణం బాగాలేదు కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. అనంతపురంలో రోడ్ల కాంట్రాక్టు పనుల కోసం తాను రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, రాజీనామా ఎప్పుడు చేయాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొన్నారు. తాను గౌరవంగా తప్పుకోవాలని అనుకుంటున్నానని, తనకు రాజకీయ వారసుడిగా తన కుమారుడు కొనసాగుతాడని చెప్పారు. ఎప్పుడు రాజీనామా చేసినా చెప్పే చేస్తానని అన్నారు.

Telugudesam
JC Diwakar Reddy
Resign
Anantapur
  • Loading...

More Telugu News