jio: జియో సరికొత్త ఆఫర్.. రూ.99కే 14జీబీ డేటా!

  • మాన్‌సూన్ హంగామా ఆఫర్లో భాగంగా సరికొత్త ప్లాన్
  • రోజుకి 500ఎంబీ డేటా
  • 28 రోజుల కాలపరిమితి

సంచలనాలు సృష్టిస్తోన్న జియో సంస్థ తన జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సరికొత్త ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈరోజు నుండి మాన్‌సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో జియో సంస్థ తన వినియోగదారుల కోసం రూ.99 రీఛార్జ్ ప్లాన్ ని ప్రకటించింది.

ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు 14జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్ పొందుతారు. 28 రోజుల కాలపరిమితి గల ఈ ఆఫర్లో రోజుకి 500ఎంబీ డేటాతో పాటు 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌ లని పొందుతారు. అలాగే పాత జియోఫోన్ లు ఎక్స్‌చేంజ్ చేసుకునే వాళ్లు రూ.594 రీఛార్జ్ చేసుకుంటే ఆరు నెలలపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా పొందుతారు.

jio
offer
Hyderabad
  • Loading...

More Telugu News