devineni avinash: విజయవాడలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని టీడీపీ నిరసన!

  • దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో తెలుగుయువత నిరసన
  • లోక్ సభలో మోదీ భాష దారుణంగా ఉందన్న అవినాష్
  • హామీల విషయంలో యూటర్న్ తీసుకున్నది బీజేపీనే

ఏపీ ప్రజలను కించపరిచే విధంగా, ఆంధ్రుల మనోభావాలను గాయపరిచే విధంగా నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగిందని టీడీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ హామీ ఇవ్వలేదా? అని మోదీని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. మోదీ మాట్లాడిన భాష దారుణంగా ఉందని చెప్పారు.

టీడీపీ యూటర్న్ తీసుకుందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను అవినాష్ ఖండించారు. ఏపీ విషయంలో యూటర్న్ తీసుకున్న పార్టీ బీజేపీనే అని మండిపడ్డారు. విభజన హామీలను నెరవేర్చని మోదీకి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో తెలుగుయువత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కూడలి వద్ద, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ... ఆ తర్వాత మాట మార్చిందని విమర్శించారు.  

devineni avinash
Narendra Modi
protest
vijayawada
  • Loading...

More Telugu News