byreddy rajasekhar reddy: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బైరెడ్డి.. బీజేపీపై ఫైర్!
- కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించిన రాహుల్
- ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్న బైరెడ్డి
- ఆ పార్టీలు ఏమీ సాధించలేవన్న కోట్ల
రాయలసీమలోని సీనియర్ నేతల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, బైరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు రాహుల్. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా పాల్గొన్నారు.
అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే అని జోస్యం చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని, రానున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ సీట్లు రావని అన్నారు. దేశ ప్రజలంతా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు.
కేవలం 13 జిల్లాలకే పరిమితమైన పార్టీలు ఏమీ సాధించలేవని టీడీపీ, వైసీపీ, జనసేనలను ఉద్దేశించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పారు.