Mussori: నదిలో పడవ మునిగి 13 మంది మృతి... మరో పడవ నుంచి తీసిన వీడియో!

  • మిస్సోరిలోని టేబుల్ రాక్ నదిలో ఘటన
  • ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన టూరిస్టులు
  • ప్రమాదంలో నలుగురి గల్లంతు

సరదాగా ప్రకృతి అందాలను చూసి రావాలని బయలుదేరిన వారిని మృత్యువు వెంటాడింది. నదిలో విహారానికి వెళ్లిన వారి పడవ అలల తాకిడికి మునిగిపోగా, 13 మంది మరణించారు. అప్పటిదాకా శాంతంగా ఉన్న నదీ జలాలు, తుఫాను గాలుల కారణంగా, భారీ అలలతో అల్లకల్లోలం కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఈ ఘటన అమెరికాలోని మిస్సోరి పరిధిలోని స్టోన్ కౌంటీ, టేబుల్ రాక్ నదిలో జరిగింది. 31 మందితో బయలుదేరిన డక్ బోటు నది మధ్యలో ఉండగా, 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పడవ మునిగిపోగా, 14 మంది ప్రాణాలతో మిగిలారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి వుంది. ఈ మొత్తం ఘటనను దూరంగా ఉన్న మరో బోట్ లోని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాల్లో పెట్టడంతో వైరల్ అయింది.


Mussori
Table rock River
Duick Boat
Capasises
  • Error fetching data: Network response was not ok

More Telugu News