Chandrababu: టీడీపీ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకుంది: మోదీ

  • తెలుగుతల్లి స్ఫూర్తిని కాపాడాలని ఇప్పుడూ అంటున్నా
  • 14వ ఆర్థిక సంఘం సిఫారసులు కట్టడి చేశాయి
  • ప్రత్యేక ప్యాకేజ్ ని నాడు చంద్రబాబు స్వాగతించారు

తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని అప్పుడే కాదు, ఇప్పుడూ అంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాజ్ పేయీ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి గొడవలు జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే భారత్-పాక్ విభజన జరిగిందని ఆ సమస్య అలానే ఉందని, అదే కాంగ్రెస్ హయాంలో ఏపీ-తెలంగాణ విభజన జరిగిందని, ఈ సమస్య కూడా అలానే ఉందని విమర్శించారు.

ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తున్నామని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక, సాధారణ రాష్ట్రాల విషయాన్ని పక్కన పెట్టాలని, ఈశాన్య, పర్వత ప్రాంతాల ప్రాతిపదికన చూడాలని సూచించిందని, ఆ సిఫారసులు తమను కట్టడి చేశాయని చెప్పారు. 2016 సెప్టెంబర్ లో ప్రత్యేక ప్యాకేజ్ ని ప్రకటించామని, సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారని, టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకుందని విమర్శించారు.  

  • Loading...

More Telugu News