vinod: పోలవరంకు ఎన్ని నిధులు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు.. కానీ.. : లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • విభజన చట్టంలో తెలంగాణను పట్టించుకోలేదు
  • తెలంగాణలో ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి
  • పోలవరంకు ఇచ్చిన విధంగానే నిధులు ఇవ్వాలి

ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్ని నిధులు అడిగినా తమకు అభ్యంతరం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. విభజన చట్టాన్ని తయారు చేసే సమయంలో తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణకు నీటి సమస్య ఎక్కువగా ఉందని... ప్రస్తుతం మూడు ప్రాజెక్టులను తాము నిర్మిస్తున్నామని... ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని... ఈరోజే తమ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఏదో ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, పోలవరంకు ఇస్తున్నట్టుగానే నిధులను ఇవ్వాలని కోరారు. 

vinod
TRS mp
polavaram
projects
  • Loading...

More Telugu News