Chandrababu: కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గల్లా సమగ్రంగా ఆవిష్కరించారు: సీఎం చంద్రబాబు

  • గల్లా ప్రసంగంపై చంద్రబాబు ప్రశంసలు 
  • ఆంధ్రుల డిమాండ్లు, హామీలను మోదీ నెరవేర్చాలి
  • విభజన చట్టం, నాటి ప్రధాని హామీలూ అమలు చేయాలి

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని దేశ ప్రజల ముందు ఎంపీ గల్లా జయదేవ్ సమగ్రంగా ఆవిష్కరించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 5 కోట్ల ఆంధ్రుల డిమాండ్లు, హామీలను ప్రధాని మోదీ నెరవేర్చాలని, విభజన చట్టం, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

కాగా, మంత్రి నారా లోకేశ్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏపీకి న్యాయం చేస్తారని ఎన్డీయేలో చేరితే, బీజేపీ మాత్రం తమకు అబద్ధపు హామీలు ఇస్తూ వచ్చిందని వరుస ట్వీట్లలో ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వమైనా ఏపీకి మేలు చేస్తుందన్న నమ్మకంతో 2014లో తాము ఎన్డీఏలో చేరామని, తమకు న్యాయం చేయాలని అభ్యర్థించామని, ఇన్ని రోజులు వేచి చూశామని, సీఎం చంద్రబాబు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ప్రతిఒక్కరూ పాల్గొంటారని, ఏపీకి న్యాయం చేయాలనేదే తమ డిమాండ్ అని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News