shriya: 'వీర భోగ వసంత రాయలు' నుంచి శ్రియ ఫస్టు పోస్టర్

  • నాలుగు ప్రధానమైన పాత్రలు 
  • విభిన్నమైన గెటప్పులు
  • ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలు

బెల్లన అప్పారావు నిర్మాణంలో .. ఇంద్రసేన దర్శకత్వంలో 'వీరభోగ వసంతరాయలు' సినిమా రూపొందుతోంది. నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీ విష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియ ఫస్టు పోస్టర్ ను వదిలారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రియ కొత్తగా కనిపిస్తోంది. శ్రియ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశారట .. ఆమె కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంటున్నారు.

నారా రోహిత్ కూడా ఈ సినిమాలో న్యూ లుక్ తో కనిపిస్తాడని చెబుతున్నారు. ఒక చేయి లేని వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. శ్రీవిష్ణు పాత్ర విషయానికే వస్తే .. గుండుతో .. ఒంటినిండా టాటూలతో చిత్రంగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇక సుధీర్ బాబు ఎలా  కనిపిస్తాడనేది తెలియాల్సి వుంది. ఇప్పటికే టైటిల్ మంచి మార్కులు కొట్టేసింది .. పోస్టర్స్ కూడా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటున్నాయి. దాంతో సహజంగా అంచనాలు పెరిగిపోతున్నాయి.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News