Anchor: యాంకర్ ను వేధిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు కటకటాల వెనక్కి!

  • ప్రైవేటు చానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న యువతి
  • వేరువేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి అసభ్యపు మాటలు
  • అన్నదమ్ములను అరెస్ట్ చేసిన కృష్ణలంక పోలీసులు

ఓ ప్రైవేటు చానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న యువతిని అసభ్య పదజాలంతో వేధిస్తున్న ఇద్దరిని విజయవాడ, కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బాధితురాలు ఓ ప్రైవేటు చానల్ లో యాంకర్ గా పనిచేస్తోంది. ఆమెను ఇద్దరు వ్యక్తులు వేధించడం మొదలుపెట్టారు. వారి నంబర్లను బ్లాక్ చేసినా, వేరువేరు ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ చేయడం ప్రారంభించారు.

ఈ నెల 1వ తేదీన ఆమె పోలీసులను ఆశ్రయించగా, వారి ఫోన్ నంబర్ల ఆధారంగా నెల్లూరుకు చెందిన అన్నదమ్ములు పరుచూరి పెద్దబాబు, పరుచూరి చిన్నబాబుగా గుర్తించారు. వీరు చిన్న చిన్న పనులు చేస్తూ జులాయిగా తిరుగుతుంటారని, కొన్ని నంబర్లను సీరియల్ గా డయల్ చేస్తూ, ఎవరైనా ఆడవాళ్లు ఫోన్ ఎత్తితే, వారిని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తమ పైశాచికానందాన్ని తీర్చుకుంటుంటారని వెల్లడించారు. వీరి ఫోన్ సిగ్నల్స్ పై నిఘా పెట్టి పెద్దబాబును బెంగళూరులో, చిన్నబాబును నెల్లూరులో అరెస్ట్ చేశామని, గతంలో ఎంతో మంది మహిళలతో వీరు ఇలాగే ప్రవర్తించారని చెప్పారు.

Anchor
Vijayawada
Police
arrest
Harrasment
  • Loading...

More Telugu News