Galla Jayadev: టీడీపీకి ఇచ్చిన సమయం 13 నిమిషాలైతే... 58 నిమిషాలు సాగిన గల్లా ప్రసంగం

  • సుదీర్ఘంగా సాగిన గల్లా జయదేవ్ ప్రసంగం
  • ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా సాగిన ప్రసంగం
  • మధ్య మధ్య కొన్ని నిమిషాల అంతరాయం

తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వివిధ పార్టీలు మాట్లాడే సమయాన్ని ముందుగానే ఖరారు చేస్తూ టీడీపీకి 13 నిమిషాల సమయం కేటాయించగా, ఆయన ప్రసంగం సుమారు గంటపాటు సాగింది. తన సుదీర్ఘ ప్రసంగంలో ఏపీ విభజన సమయంలో జరిగిన పరిణామాల నుంచి రాష్ట్ర విభజన తీరుతో పాటు, ఆదాయ వ్యయాల లెక్కలు, ఆదాయం, అప్పులు, ఇంకా అపరిష్కృతంగానే ఉన్న సమస్యలను ప్రస్తావించారు.

 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చి మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ వంటి ప్రధాన డిమాండ్లపై వివరణ ఇచ్చారు. ఆయన ప్రసంగం యావత్తూ నరేంద్ర మోదీని విమర్శించడమే లక్ష్యంగా సాగింది. 58 నిమిషాల పాటు గల్లా ప్రసంగం సాగగా, కొన్ని నిమిషాల పాటు మాత్రమే అంతరాయం కలిగింది.

Galla Jayadev
Lok Sabha
Andhra Pradesh
Narendra Modi
  • Loading...

More Telugu News