Narendra Modi: మోదీని 'మోసగాడు' అన్న గల్లా... తీవ్రంగా విరుచుకుపడిన నిర్మలా సీతారామన్!

  • ప్రధానిని మోసగాడంటే అంగీకరించబోము
  • ఏపీకి ఏం చేశామో తెలుసు
  • ఆ పదాన్ని వెనక్కు తీసుకోవాలని సీతారామన్ డిమాండ్

తన సుదీర్ఘ ప్రసంగంలో నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఓ దశలో మోదీని 'మోసగాడు' అని సంబోధించడంపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. గౌరవనీయ పదవిలో ఉన్న ప్రధానిని మోసగాడని అనడాన్ని తాము అంగీకరించబోమని చెప్పారు. ఏపీకి ఏం చేశామో తమకు తెలుసునని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మరచిపోయిందని చెప్పారు. వెంటనే 'మోసగాడు' అన్న పదాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, అటువంటి అభ్యంతరకర పదాలు రికార్డులో ఉంటే తొలగిస్తామని చెప్పారు.

Narendra Modi
Nirmala Sitaraman
Lok Sabha
Galla Jayadev
  • Loading...

More Telugu News