Odisha: చర్చ కూడా ప్రారంభం కాకుండానే బీజేడీ వాకౌట్!

  • ఒడిశాకు కేంద్రం అన్యాయం చేస్తోంది
  • నిరసగా వాకౌట్ చేస్తున్నామంటూ వెళ్లిపోయిన బీజేడీ
  • మొదలైన గల్లా జయదేవ్ ప్రసంగం

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ కూడా ప్రారంభం కాకుండానే బిజూ జనతాదళ్ వాకౌట్ చేసింది. విపక్షాలకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం సరిపోదంటూ ఖర్గే మాట్లాడుతున్న వేళ, బీజేడీ పక్ష నేత తనకు మైక్ కావాలని తీసుకున్నారు. ఆపై ఆయన మాట్లాడుతూ, తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. ఆపై స్పీకర్ అవిశ్వాస తీర్మానం పెట్టిన కేశినేని నానిని మాట్లాడాలని చెప్పగా, ఆయన తనకు బదులుగా గల్లా జయదేవ్ ప్రసంగిస్తారని వ్యాఖ్యానించారు. అందుకు స్పీకర్ అనుమతించారు.

Odisha
parliament
Lok Sabha
Galla jayadev
BJD
  • Loading...

More Telugu News