akhil: రవిరాజా పినిశెట్టి తనయుడి దర్శకత్వంలో అఖిల్?

  • అఖిల్ కి లైన్ వినిపించిన సత్యప్రభాస్ 
  • ఇంట్రెస్టింగ్ గా వుందని చెప్పిన అఖిల్ 
  • కథపై జరుగుతోన్న కసరత్తు

ప్రస్తుతం అఖిల్ తన మూడవ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. దాంతో మరో ప్రాజెక్టును లైన్లో పెట్టే పనిలో అఖిల్ వున్నాడని చెబుతున్నారు.

రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి నటుడు అనే విషయం తెలిసిందే. ఆయన సోదరుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. గతంలో ఆయన 'మలుపు' అనే ఒక సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల ఆయన అఖిల్ ను కలిసి ఒక లైన్ చెప్పాడట. లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో .. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని అఖిల్ అన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కథపై సత్యప్రభాస్ కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. పూర్తి కథ అఖిల్ కి నచ్చేసిందంటే .. అఖిల్ నాల్గొవ సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.

akhil
sathyaprabhas pinishetty
  • Loading...

More Telugu News