pawan kalyan: రాష్ట్ర ప్రజలతో కలసి నేను కూడా కోరుతున్నా: పవన్ కల్యాణ్

  • ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ప్రజలంతా కోరుతున్నారు
  • ఏపీకి న్యాయం చేయాలి
  • పార్లమెంటును మించిన వేదిక లేదు

కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు పార్లమెంటులో చర్చ జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని... హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలతో కలసి తాను కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన తెలిపారు. మన హక్కుల గురించి చర్చించి, సరైన నిర్ణయం తీసుకోవడానికి పార్లమెంటును మించిన వేదిక లేదని చెప్పారు. ఏపీకి న్యాయం చేయాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

pawan kalyan
special status
bjp
no confidence motion
  • Loading...

More Telugu News