jagan: హైదరాబాద్ లో వైఎస్ జగన్ ని కలసిన ఆనం!

  • వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ తో ఆనం మంతనాలు
  • నలభై ఐదు నిమిషాలకు పైగా చర్చ?
  • ఈ నెలలో జగన్ ని ఆనం కలవడం రెండోసారి 

వైసీపీ అధినేత జగన్ ని టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ని ఈరోజు ఆయన కలిశారు. వైసీపీలో చేరే విషయమై వారి మధ్య చర్చ జరిగింది. నలభై ఐదు నిమిషాలకు పైగా వారు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఆనంను వైసీపీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడికి తీసుకువచ్చినట్టు సమాచారం.
 
కాగా, టీడీపీని ఆనం వీడనున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో జగన్ ని ఆనం కలవడం ఇది రెండోసారి. ఈ నెల 7వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ని ఆయన మొదటిసారి కలిశారు. పొతే, వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి ఆనం పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆయన వర్గీయుల సమాచారం. 

jagan
anam ramnarayan reddy
  • Loading...

More Telugu News