sunitha: రెండో పెళ్లి వార్తలపై సింగర్ సునీత స్పందన!

  • ఇతరుల జీవితాల గురించి ఎందుకంత ఆసక్తి అని పశ్నించిన సునీత
  • రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు
  • సునీతకు 20 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు

సినీ గాయని సునీత రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె స్పందించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి ఎప్పుడూ ఎందుకంత ఆసక్తిని కనబరుస్తారు? అంటూ ఆమె ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించారు. 40 ఏళ్ల వయసున్న సునీతకు 20 ఏళ్ల కుమారుడు ఆకాష్, 17 ఏళ్ల కుమార్తె శ్రేయ ఉన్నారు. 19 ఏళ్ల వయసులో కిరణ్ ను ఆమె వివాహం చేసుకున్నారు. కొన్ని మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

ఇప్పటివరకు వందలాది పాటలను పాడిన సునీత... డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా బిజీగా ఉన్నారు. రాశి, భూమిక, అనుష్క, జ్యోతిక, ఛార్మి, మీరా జాస్మిన్, లైలా, సోనాలీ బెంద్రే, సౌందర్య, రిచా గంగోపాధ్యాయ్, శ్రియ, స్నేహ, జెనీలియా, కత్రినా కైఫ్, తమన్నా, ఇలియానా, కమిలినీ ముఖర్జీ, త్రిష, నయనతార తదితర హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెప్పారు.  

sunitha
singer
tollywood
second marriage
  • Loading...

More Telugu News