pradeep: బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ వచ్చేస్తున్నాడు!

  • ఒక వైపున సరదాగా ఆటపాటలు 
  • మరో వైపున వేడెక్కించే ఎలిమినేషన్స్ 
  • యాంకర్ ప్రదీప్ ఎంట్రీతో అందరిలో ఆశ్చర్యం

రోజులు గడుస్తున్న కొద్దీ 'బిగ్ బాస్ 2' షో ఆసక్తికరంగా మారుతోంది. ఒక వైపున ఆటపాటలతో సరదాగా సాగిపోతూనే మరో వైపున ఎలిమినేషన్స్ తో వేడెక్కుతోంది. ఇంటిలోని సభ్యుల సంఖ్య ఎలిమినేషన్స్ తో తగ్గిపోతూ వుండటంతో, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు రానున్నారా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మొన్నటికి మొన్న బిగ్ బాస్ హౌస్ లోకి ప్రత్యేకంగా ఒక బెడ్ వచ్చింది. అప్పటి నుంచి వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరు ఇవ్వనున్నారా అనే ఆసక్తి మరింతగా పెరిగిపోయింది. ఈ సస్పెన్స్ కి తెరదించేస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టేశాడు. మంచి జోష్ .. సమయస్ఫూర్తి ప్రదీప్ ప్రత్యేకతలు. ఎదుటివారిని హర్ట్ చేయకుండా చూసేవారికి వినోదాన్ని కలిగించడం ఆయనలోని మరో ప్రత్యేకత. అలాంటి ప్రదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోని వాతావరణం ఎలా మారుతుందో .. ఇంకెంత ఆసక్తికరంగా కొనసాగుతుందో వేచిచూడాలి.   

pradeep
  • Error fetching data: Network response was not ok

More Telugu News