samanta: సమంత, చైతూ సెట్స్ పైకి వెళ్లేది ఆ రోజునే!

- నాగచైతన్య జోడీగా సమంత
- పెళ్లి తరువాత కలిసి చేస్తోన్న ఫస్టు మూవీ
- ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలు
'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత .. చైతూ యూత్ హృదయాలను దోచేశారు. ఈ సినిమా నుంచే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలై భార్యాభర్తలయ్యేలా చేసింది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటి కథ కోసం వెయిట్ చేస్తూ వస్తోన్న ఈ జంటకు, తాజాగా ఒక మంచి కథ దొరికేసింది. దర్శకుడు శివ నిర్వాణ వినిపించిన కథ నచ్చడంతో సమంత .. చైతూ ఓకే చెప్పేశారు.
