no confidence motion: మోదీకి జై కొట్టిన అన్నాడీఎంకే.. టీడీపీకి మద్దతు ఇవ్వబోమంటూ స్పష్టీకరణ

  • కావేరీ జలాల విషయంలో టీడీపీ మాకు సహకరించలేదు
  • అవిశ్వాసానికి తాము మద్దతు ఇవ్వబోమన్న అన్నాడీఎంకే
  • ఇంతవరకు వైఖరిని వెల్లడించని శివసేన

గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా... కావేరీ జలాల పేరుతో అన్నా డీఎంకే అనుక్షణం సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కనుసన్నల్లో మెలుగుతూ... అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా విజయవంతంగా తన పాత్రను పోషించిందనే ప్రచారం కూడా జరిగింది.

ఇప్పుడు కూడా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమంటూ ఆ పార్టీ స్పష్టం చేసింది. కావేరీ జలాల విషయంలో తమ పోరాటానికి టీడీపీ సహకరించలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో, అవిశ్వాసం విషయంలో టీడీపీకి తాము సహకరించమని చెప్పింది. మరోవైపు, అవిశ్వాస తీర్మానంపై తమ వైఖరి ఏమిటో ఇంతవరకు శివసేన వెల్లడించలేదు.

no confidence motion
Telugudesam
aiadmk
support
  • Loading...

More Telugu News