nithin: 'శ్రీనివాస కళ్యాణం' నుంచి కాన్సెప్ట్ టీజర్!

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'శ్రీనివాస కళ్యాణం' 
  • నితిన్ సరసన రాశి ఖన్నా
  • ఈ 22న ఆడియో వేడుక

నితిన్ .. రాశి ఖన్నా జంటగా దర్శకుడు సతీశ్ వేగేశ్న 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను రూపొందించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు.

"మనం పుట్టినప్పుడు మన వాళ్లంతా ఆనందపడతారు .. అది మనకి తెలియదు. మనం దూరమైనప్పుడు మన వాళ్లంతా బాధపడతారు .. అదీ మనకి తెలియదు. మనకి తెలిసి మనం సంతోషంగా వుండి .. మనవాళ్లంతా సంతోషంగా వుండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ 'శ్రీనివాస కళ్యాణం' " అంటూ జయసుధతో చెప్పించిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 22వ తేదీన జరపనున్నట్టుగా ఈ టీజర్ ద్వారానే తెలియజేశారు. జయసుధ .. ప్రకాశ్ రాజ్ .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News