New Currency: కొత్త వంద రూపాయల నోటు డిజైన్ ఇదిగో!

  • ఇప్పటికే పలు డినామినేషన్లలో కొత్త నోట్లు
  • శరవేగంగా తయారవుతున్న రూ. 100 నోట్లు
  • ఊదా రంగులో కనిపించనున్న కొత్త వంద

నోట్ల రద్దు తరువాత ఇప్పటి వరకూ రూ. 10, రూ. 50, రూ. 200, రూ. 500, రూ. 2000 కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొత్త వంద రూపాయల నోటు డిజైన్, కలర్ కు ఓకే చెప్పి ప్రింట్ చేయిస్తోంది. ఈ నోటు ఇతర కొత్త నోట్ల మాదిరిగానే ఉంటుంది. అయితే, ఊదా రంగులో కనిపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న రూ. 100 కన్నా ఇది చిన్నదిగా ఉంటుంది. కొత్త వంద నోట్లు పలు సెక్యూరిటీ ఫీచర్స్ తో తయారు అవుతున్నాయని, త్వరలోనే చలామణిలోకి వస్తాయని వెల్లడించిన అధికారులు, కొత్తవి వచ్చినా పాత కరెన్సీ కూడా చెల్లుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. 

New Currency
Rs. 100
RBI
  • Loading...

More Telugu News