anchor Anasuya: మొబైల్ లో వీడియో చూస్తూ యువకుడి డ్రైవింగ్... వీడియో తీసి ఫిర్యాదు చేసిన యాంకర్ అనసూయ!

  • గతంలో ఒకరి తప్పు వల్ల ప్రమాదానికి గురయ్యా 
  • ఇటువంటి వారిని వదలొద్దు
  • ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ

ఇటీవల 'రంగస్థలం'తో తనలోని నటిని సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిన ప్రముఖ యాంకర్ అన‌సూయ, తాజాగా ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తాను తీసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నిన్న సాయంత్రం తాను బంజారాహిల్స్ రోడ్డు గుండా వెళుతుంటే ఈ దృశ్యం కనిపించిందని చెప్పింది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న ఓ యువకుడు, తనకు ఎదురుగా ఉన్న స్మార్ట్ ఫోన్ లో వీడియోను చూస్తూ కారు నడుపుతున్నాడని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన తనను భయపెట్టిందని, గతంలో మరొకరు చేసిన తప్పుతో తాను ప్రమాదానికి గురయ్యానని చెప్పింది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదలద్దని చెప్పింది. రహదారులపై ఇష్టమొచ్చినట్టు డ్రైవ్ చేసేవారికి ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. అనసూయ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు ఏదైనా చర్య తీసుకున్నారా? లేదా? అన్న విషయం తెలియాల్సివుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News