Tungabhadra: నాలుగేళ్ల తరువాత తొలిసారి తెరచుకున్న తుంగభద్ర గేట్లు!
- 1631 అడుగులకు నీటిమట్టం
- ఎగువ నుంచి కొనసాగుతున్న వరద
- 12 గేట్లను ఎత్తివేసిన అధికారులు
2014 తరువాత తుంగభద్ర జలాశయం గేట్లు తెరచుకున్నాయి. 1633 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ లో 1631 అడుగులకు నీరు చేరడం, ఆపై ఎగువ నుంచి మరింతగా వరద వస్తుండటంతో 12 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
పై నుంచి 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటం, మరింత వరద నదిలోకి చేరుతుందన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా నీటిని దిగువకు వదులుతున్నామని, పరిస్థితిని సమీక్షించి, నేడు మిగతా గేట్లను ఎత్తుతామని తెలిపారు. జూలైలోనే జలాశయం నిండటం వల్ల ఖరీఫ్ కు కావాల్సిన నీటికి ఢోకా లేదని, నవంబర్ లో మరోసారి ప్రాజెక్టు నిండితే రబీకి కూడా నీరిస్తామని అన్నారు. కాగా, 2014లో తుంగభద్ర నిండిన తరువాత, మళ్లీ పూర్తి స్థాయికి నీటిమట్టం చేరడం ఇదే తొలిసారి.