High Court: సుప్రీం, హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు పెంపుపై బిల్లు?

  • పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు
  • పదవీ విరమణ వయసు రెండేసి ఏళ్లు పెంపు 
  • జడ్జిల కొరతను తగ్గించే ప్రయత్నం 

దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత కారణంగా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పొడిగించాలని, తద్వారా జడ్జిల కొరతను తగ్గించడమే కాకుండా, పెండింగ్ లో ఉన్న కొన్ని కేసుల విచారణ తొందరగా పూర్తవుతుందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

కాగా, సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు వరుసగా 65, 62 సంవత్సరాలుగా ఉంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 67కు, హైకోర్టులలో న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 64కు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. 

High Court
Supreme Court
judges
  • Loading...

More Telugu News