manchu lakshmi: ఏ సినిమాతోనూ 'వైఫ్ ఆఫ్ రామ్'కి పోలిక లేదు: మంచు లక్ష్మి

  • ఇది ఓ మధ్యతరగతి భార్య కథ
  • పాటలు .. డాన్సులు వుండవు
  • అయినా అందరికీ నచ్చుతుంది

మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా విజయ్ యలకంటి దర్శకత్వంలో 'వైఫ్ ఆఫ్ రామ్' సినిమా రూపొందింది. సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ .. "సహజత్వానికి చాలా దగ్గరగా మలచబడిన కథ ఇది. హీరో .. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేయరు .. తమకి తెలియకుండానే కథలోకి ఎంటరవుతారు.

కథా పరంగా పాటలు .. డాన్సులు లేకపోయినా ఎక్కడా వాటిని గురించిన ఆలోచన రాదు. ఒక మధ్యతరగతి ఇల్లాలు ..  ఒకానొక సంఘటనతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందనే కథాంశంతో ఈ సినిమా అనూహ్యమైన మలుపులతో కొనసాగుతుంది. ఇది ఓ భార్య చుట్టూ తిరిగే కథ కావడం వలన 'కహాని' సినిమాతో పోల్చవద్దు. ఏ సినిమాకి 'వైఫ్ ఆఫ్ రామ్'తో పోలికలు వుండవు అని కచ్చితంగా చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.  

manchu lakshmi
  • Loading...

More Telugu News