ramdas athawale: 20న మా సత్తా ఏంటో విపక్షాలకు చూపిస్తాం: రాందాస్ అథవాలే

  • విపక్షాలది ఓవర్ కాన్ఫిడెన్స్
  • విశ్వాస పరీక్షలో నెగ్గుతాం
  • సోనియా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రాందాస్

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (నో కాన్ఫిడెన్స్)పై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సెటైర్లు వేశారు. విపక్షాల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. జూలై 20న జరిగే విశ్వాస పరీక్షలో క్లియర్ మెజార్టీని సాధిస్తామని చెప్పారు. తమ సత్తా ఏంటో విపక్షాలకు చూపిస్తామని తెలిపారు. తమకు సంఖ్యాబలం లేదని ఎవరు చెప్పారంటూ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో వైసీపీ చేరితే జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఇటీవల రాందాస్ అథవాలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ramdas athawale
Sonia Gandhi
no confidence motion
  • Loading...

More Telugu News