thota narasimham: కేంద్రాన్ని ఎండగట్టేందుకు మంచి అవకాశం దొరికింది: టీడీపీ ఎంపీ తోట నరసింహం

  • సంఘీభావం ప్రకటించిన పార్టీలకు ధన్యవాదాలు
  • కేంద్రంపై ప్రజలకు ఎంతమాత్రం విశ్వాసం ఉందో తేలిపోతుంది
  • కేంద్ర ప్రభుత్వ అన్యాయాలను వివరిస్తాం

టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమోదం తెలపడంపై ఆ పార్టీ ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. తమ అవిశ్వాస తీర్మానానికి విపక్షాలన్నీ సంఘీభావం ప్రకటించాయని... అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంపీ తోట నరసింహం అన్నారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు మంచి అవకాశం దొరికిందని చెప్పారు. మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో ఈ చర్చతో తెలుస్తుందని తెలిపారు. శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే.

thota narasimham
no confidence motion
Telugudesam mp
  • Loading...

More Telugu News