vidyabalan: విద్యాబాలన్ కు చీర బహూకరించిన బాలయ్య కుటుంబం.. ఫొటోలు చూడండి
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d958e274880aa7cbdbe87b0ba1a897255e832b0f.jpg)
- బసవతారకం పాత్రను పోషిస్తున్న విద్యాబాలన్
- బాలయ్య ఇంట్లో సందడి చేసిన బాలీవుడ్ భామ
- సాదరంగా ఆహ్వానించిన బాలయ్య కుటుంబసభ్యులు
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్'లో కీలకమైన బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఆమెపై సీన్స్ చిత్రీకరణ ప్రారంభమైంది. అంతకుముందే హైదరాబాద్ చేరుకున్న ఆమె, బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కుటుంబీకులను కలసి బసవతారకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బాలయ్య ఇంటికి విద్యాబాలన్ వెళ్లింది. తమ ఇంటికి వచ్చిన ఆమెను బాలయ్య, ఆయన భార్య వసుంధర, కుమార్తె తేజశ్విని, అల్లుడు భరత్, సోదరి లోకేశ్వరిలు సాదరంగా ఆహ్వానించారు. ఆమెకు చీరను బహూకరించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-5b0dd1fcc48e9befd10c6d4504cb53fdac763554.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-7fbcf4e6cbc19cb9f12e7805a97c6f0ebc85a996.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-ca452e4136cb0721ac7e53c22985611bea9b0e12.jpg)