aiadmk: పతనావస్థలో అన్నాడీఎంకే.. సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోని 60 లక్షల మంది కేడర్!
- జయలలిత ఉన్నప్పుడు 1.50 కోట్లు దాటిన సభ్యత్వాలు
- ప్రస్తుతం 90 లక్షలకే పరిమితం
- కలవర పడుతున్న పార్టీ నేతలు
జయలలిత బతికినంత కాలం ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే పార్టీ... ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు పార్టీ కేడర్ షాక్ ఇచ్చింది. జయలలిత మరణం తర్వాత దాదాపు సగానికి సగం మంది తమ సభ్యత్వాలను రెన్యువల్ చేసుకోలేదు.
60 లక్షలకు పైగా కేడర్ తమ పార్టీ సభ్యత్వాన్ని కొనసాగించలేదు. జయలలిత ఉన్నప్పుడు పార్టీ సభ్యత్వాలు కోటి యాభై లక్షలు దాటగా... ప్రస్తుత సభ్యత్వాలు కేవలం 90 లక్షలకే పరిమితమయ్యాయి. మిగిలివారంతా తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ వైపు వెళ్లినట్టుగా భావిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్ ను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు పళని, పన్నీర్ లు ప్రణాళికలు రచిస్తున్నారు.