nithin: 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడి నెక్స్ట్ మూవీ .. హీరోగా నితిన్

- 'ఆర్ ఎక్స్ 100'తో భారీ హిట్
- దర్శకుడికి విపరీతమైన క్రేజ్
- పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు
ఇటీవల కాలంలో యూత్ ను ఎక్కువగా ప్రభావితం చేసిన సినిమాగా 'ఆర్ ఎక్స్ 100' కనిపిస్తుంది. విడుదలైన ప్రతి చోటున ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ కారణంగా దర్శకుడు అజయ్ భూపతికి వరుసగా పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక వైపున సురేశ్ బాబు .. మరో వైపున స్రవంతి రవికిశోర్ వంటి పెద్ద నిర్మాతలు అజయ్ భూపతితో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
