Tamil: తమిళ యువ నటి ప్రియాంక ఆత్మహత్య

  • 'వంశం'తో సూపర్ హిట్ కొట్టిన ప్రియాంక
  • భర్తతో గత కొంతకాలంగా విభేదాలు
  • ఈ ఉదయం ఇంట్లో ఆత్మహత్య

యువనటి, పలు తమిళ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. 'వంశం' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, ఈ ఉదయం వలసరవాక్కంలోని తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది. ఈ ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించగా, విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గత కొంతకాలంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోందని, కుటుంబ విభేదాలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సివుంది.

Tamil
Actress
Priyanka
Sucide
  • Loading...

More Telugu News