karunanidhi: శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన కరుణానిధి

  • కరుణకు స్వల్ప శస్త్ర చికిత్సను నిర్వహించనున్న వైద్యులు
  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణ
  • ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న డీఎంకే శ్రేణులు

డీఎంకే అధినేత కరుణానిధి గత కొంత కాలంగా గొంతు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. ఆయనకు స్పల్ప శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు.

 ఆసుపత్రిలో కరుణానిధి చేరిన విషయాన్ని తెలుసుకున్న డీఎంకే శ్రేణులు భారీ ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, కరుణానిధి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన స్పష్టమైన వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.  

karunanidhi
ill
hospital
dmk
operation
  • Loading...

More Telugu News